అక్కినేని హీరో నాగచైతన్య రీసెంట్ గా నటించిన 'కస్టడీ' మూవీ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అఖిల్ 'ఏజెంట్' సినిమా తర్వాత విడుదలైన కస్టడీ మూవీ ఇప్పుడు ఓటిటిలో ఏజెంట్ కన్నా ముందే రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటించగా.. తమిళ విలక్షణ నటుడు అరవింద్ స్వామి కీలక పాత్ర పోషించారు. భారీ అంచనాల నడుమ మే 12న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అటు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ నష్టాలను మిగిల్చింది. 

ఈ సినిమాలో నాగచైతన్య కానిస్టేబుల్ పాత్రలో కనిపించడం కోసం బాగానే కష్టపడ్డాడు. కానీ ఆడియన్స్ ని మెప్పించడంలో ఈ సినిమా విఫలమైంది. ఇక తాజా సమాచారం ప్రకారం కస్టడీ మూవీ జూన్ 9 లేదా 16 తేదీలలో ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు డేట్స్ లో ఏ డేట్ అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కస్టడీ మూవీ ఓటిటి రైట్స్ ని ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సుమారు 8 కోట్లకు తెలుగు తో పాటు తమిళ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. దీంతో ఒకే తేదీన కస్టడీ మూవీ ఇటు తెలుగుతోపాటు తమిళంలోనూ ఓటీడీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఎప్పుడూ విభిన్న కథలను ఎంచుకొని తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసే దర్శకుడు వెంకట ప్రభు ఈ సినిమాతో బాగా డిసప్పాయింట్ చేశాడు. నిజానికి కస్టడీ మూవీ విషయంలో దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నా దాన్ని ఎంగేజింగ్ గా చెప్పడంలో తడబడ్డాడు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో తమిళంలో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని అనుకున్నాడు నాగచైతన్య. కానీ అలా జరగలేదు. సుమారు 20 కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కనీసం 10 కోట్ల కలెక్షన్స్ ని కూడా రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాతలకు ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: