టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది కమెడియన్స్ ఉన్నారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే లెజెండ్స్ కానీ నిలిచారు. ఇక అలాంటి లెజెండ్స్ లో బ్రహ్మానందం కూడా ఒకరు .బ్రహ్మానందం కామెడీకి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ తోనే ప్రేక్షకులకు నవ వచ్చేలా చేస్తాడు బ్రహ్మానందం. సుమారుగా 1000 కి పైగా సినిమాల్లో నటించి ఈ మధ్యనే కాస్త స్పీడ్ తగ్గించాడు బ్రహ్మానందం. డాక్టర్లు ఇచ్చిన సూచనల మేరకు ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకొని సినిమాలకి బ్రేక్ ఇచ్చాడు. బ్రహ్మానందం గతంలో చూసుకుంటే ఏడాదికి 20 నుండి 30 సినిమాలకు పైగానే నటించాడు.  

సినిమాల్లో బ్రహ్మానందం ఉన్నాడు అని తెలిస్తే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్షలాదిమంది కేవలం ఆయన కోసం మాత్రమే సినిమా చూసేవారు. ఆయన కామెడీ తేనె సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇంకా అసలు విషయం ఏంటంటే బ్రహ్మానందం చూసే అప్పట్లో అసూయపడే కమెడియన్స్ కూడా ఉన్నారని అంటున్నారు. ఇక గతంలో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలను చేశారు బ్రహ్మానందం. నేను సినిమాలో చేయడం బాగా తగ్గించినప్పుడు చాలామంది కమెడియన్ సంతోషించారు.. కనీసం ఇప్పటికైనా మాకు అవకాశాలు వస్తాయని అనుకున్నారు..

ఒకప్పుడు ఈ సినిమాలోనైనా హీరో కానీ దర్శక నిర్మాతలు కానీ తమ సినిమాల్లో కమెడియన్ గా ముందుగా బ్రహ్మానందం నే అనుకునేవారు.. ఇక ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ బ్రహ్మానందం కారణంగానే చాలామంది కమెడియన్స్ కి గుర్తింపు రాలేదని భావించిన వాళ్ళు చాలామంది ఉన్నారు.. ఇక ఈ విషయాన్ని ఇటీవల స్వయంగా బ్రహ్మానందం చెప్పడం జరిగింది.. కానీ ఒక కమెడియన్ మాత్రం నేను రిటైర్ అయిపోయాను అంటే చాలా సంతోషించారట.. అంతేకాదు తన స్నేహితులతో కలిసి సంబరాలు కూడా చేసుకున్నారట.. బ్రహ్మానందం తర్వాత నేనే అని అందరితో చెప్పాడట ఆ కమెడియన్.. ఆ కమెడియన్ ఎవరో నాకు తెలుసు కానీ పేరు చెప్పను.. అంటూ స్వయంగా బ్రహ్మానందం వెల్లడించాడు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: