సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజీ టిల్లు. విడుదలకు ముందే పాటల ద్వారా మంచి అంచనాలను పెంచింది.విడుదల తర్వాత మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల కురిపించింది.

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూత్ ఈ సినిమాకి ఒక రేంజ్ లో అయితే కనెక్ట్ అయ్యారు. ఇప్పటికీ ఈ సినిమాని ఖాళీ దొరికినప్పుడల్లా టైం పాస్ కోసం చూస్తూనే ఉంటారు ప్రేక్షకులు. తెలంగాణ యాస లో సిద్దు జొన్నలగడ్డ చెప్పే డైలాగ్స్ కూడా నవ్వులు పూయించాయి. ఆయన కామెడీ టైమింగ్ కి కూడా ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. అప్పటి వరకు ఒకటి రెండు సినిమాల్లో హీరో గా నటించిన సిద్దు కి పెద్ద గుర్తింపు అయితే రాలేదు కానీ, ఈ సినిమాతో మాత్రం ఆయన యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని కూడా సంపాదించుకున్నాడు.

ఈ సినిమాకి కథ మరియు మాటలు మరియు స్క్రీన్ ప్లే రాసుకున్నది సిద్దు జొన్నలగడ్డ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఆయనలోని ఎన్నో టాలెంట్స్ ని కూడా బయటపెట్టాడు. వాస్తవానికి ఈ సినిమాలో తొలుత సిద్దు నటించాలని అయితే అనుకోలేదట. ఇండస్ట్రీ లో తనకి ఎంతో క్లోజ్ అయిన యంగ్ హీరో విశ్వక్ సేన్ ని  హీరో గా పెట్టి తీద్దాం అనుకున్నాడట. విశ్వక్ సేన్ కి కాన్సెప్ట్ బాగా నచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ చెయ్యాలని చాలా కోరికతో ఉన్నాడు కానీ, అదే సమయం లో ఆయన రెండు మూడు ప్రాజెక్ట్స్ కి సంబంధించిన షెడ్యూల్స్ నిర్మాతలు ప్లాన్ చెయ్యడం తో, డీజే టిల్లు కి డేట్స్ కేటాయించలేకపోయాడని సమాచారం.. దీనితో ఈ చిత్రం లో సిద్దు జొన్నలగడ్డనే హీరో గా చేసి ప్రేక్షకులను బాగా మెప్పించాడు.గత ఏడాది ఫిబ్రవరి ప్రారంభం లో విడుదలైన ఈ సినిమా 18 కోట్ల రూపాయలకు పైగా  వసూళ్లను సాధించింది. ఈ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 7 కోట్ల రూపాయిలు మాత్రమే అని నిర్మాతలకు దాదాపుగా మూడింతల లాభాల్ని అయితే తెచ్చి పెట్టింది ఈ చిత్రం. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే పేరుతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: