కావ్య కళ్యాణ్  స్టార్ హీరోల సినిమాల్లో బాలనటిగా చేసి మంచి గుర్తింపు ను సంపాదించింది..ముఖ్యంగా గంగోత్రీ, ఠాగూర్ మరియు బాలు లాంటి సినిమాల్లో బాల నటిగా మెప్పించింది కావ్య.. ఆ తరువాత వెండితెరకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇక ఆ మధ్య హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు. ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా మారింది.  ఉస్తాద్ అనే సినిమాతో హీరోయిన్ గా నటించింది.ఈ బాలనటి. మసూద, బలగం అలాగే తాజాగా పరేషాన్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.

మరీ ముఖ్యంగా బలగం సినిమాతో కావ్యకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఆ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకు తెగ నచ్చేసింది.దాంతో కావ్య కూడా ఓవర్ నైట్ స్టార్ గా అయితే మారింది. ప్రస్తుతం వరుస సినిమాలతో  బాగా బిజీ గా వుంది కావ్య. అయితే ప్రస్తుతం వరుస ఆఫర్లు వస్తుండటంతో ఆమె కమర్షియల్ సినిమాలలో హీరోయిన్ గా చేయడానికి కూడా సిద్ధం అయిపోయింది. ఈ క్రమంలో ఆమె చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి. సినిమాల్లో తాను నటించే విషయంలో చాలా బోల్డ్ కామెంట్స్ కూడా చేసింది.  డబ్బులు ఎక్కువ కనుక ఇస్తే చాలు ఎలాంటి సీన్లలో నటించడానికైనా కూడా తాను సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చింది. మంచి నటిగా నిరూపించుకోవాలంటే అన్ని రకాల సీన్లలో నటించాలని కూడా ఆమె అన్నారు. అలా నటించగలిగినప్పుడే సంపూర్ణ నటిగా తనకు మంచి గుర్తింపు అయితే వస్తుందని కావ్య చెప్పాకొచ్చారు. ఇండస్ట్రీలో ముద్దు సీన్స్ అలాగే బెడ్ సీన్ల కోసం హీరోయిన్లు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని.. తాను కూడా మంచి కథ కనుక ఉంటే అలాంటి సీన్లలో నటించడానికి సిద్ధం అని కూడా చెప్పుకొచ్చింది.అయితే అలాంటి సీన్లలో నటించడానికి ఎక్కువ డబ్బు తీసుకుంటానని అని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: