తమిళ సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో శివ కార్తికేయన్ ఒకరు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమా లలో హీరో గా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ నటుడు ఈయన నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేశాడు. అందులో వరుణ్ డాక్టర్ ... కాలేజ్ డాన్ సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాలను సాధించడంతో ఈ హీరో క్రేజ్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన రీతిలో పెరిగింది. 

ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ నటుడు ప్రిన్స్ అనే కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. ఈ మూవీ కి అనుదీప్ కే వి దర్శకత్వం వహించగా ... సత్యరాజ్మూవీ లో కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు మా వీరన్ అనే తమిళ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ మూవీ ని మహా వీరుడు పేరుతో విడుదల చేయనున్నారు.

ఈ సినిమాను జూలై 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన పనులను ఫుల్ స్పీడ్ లో పూర్తి చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను ఈ మూవీ హీరో శివ కార్తికేయన్ పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ కి మడోనే అశ్విన్ దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: