ఏ సినీ ఇండస్ట్రీలోనైనా ఒక హీరో కోసం అనుకున్న టైటిల్ నేమ్ మరొక హీరో తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఒక సినిమాకి సంబంధించిన టైటిల్ను మరొక హీరోకి ఇవ్వడానికి ఏమాత్రం ఆలోచించరు మన టాలీవుడ్ హీరోలు. ఇది ఎప్పటినుండో జరుగుతూనే వస్తుంది .అయితే ఇటీవల నందమూరి బాలకృష్ణ కూడా పవన్ కళ్యాణ్ కోసం తన ప్రొడ్యూసర్ లను రిక్వెస్ట్ చేయించుకున్న టైటిల్ని ఇచ్చాడని అంటున్నారు . ఇక అసలు విషయం ఏంటంటే... నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ప్రస్తుతం ఒక సినిమా రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం మొదట బ్రో అని టైటిల్ ని అనుకున్నారట దర్శక నిర్మాతలు. 

బ్రో టైటిల్ అయినప్పటికీ కింద క్యాప్షన్ ఐ డోంట్ కేర్ అని అనుకున్నారట. ఇక ఈ టైటిల్ అప్పట్లో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త సినిమాకి కూడా ఇదే టైటిల్ ని అనుకున్నారు చిత్ర బృందం .అయితే ఇద్దరూ ఒకే టైటిల్ని అనుకోవడంతో బాలయ్యని కలిసి మరి దర్శక నిర్మాతలు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడంతో బాలయ్య తన నిర్మాతలను అడిగి పవన్ కళ్యాణ్ సినిమా కోసం బాలయ్య తన సినిమా టైటిల్ ని ఇచ్చేసారట. ప్రస్తుతం ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది .బాలయ్య మరియు అనిల్ రావిపూడి సినిమాకి భగవత్ కేసరి అనే టైటిల్ని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ టైటిల్ కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నప్పటికీ బాలయ్య సినిమా టైటిల్ కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న బ్రో ది అవతార్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా వచ్చే నెల 28న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ హైదరాబాదులో ఊర్వశి రౌతెల కాంబినేషన్లో ఒక ఐటెం సాంగ్ తీస్తున్నారని అంటున్నారు. అయితే ఈ నెలలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేయబోతున్నారట దర్శక నిర్మాతలు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: