‘వాల్తేర్ వీరయ్య’ ఘన విజయంతో టాప్ హీరోలకు ప్రియ దర్శకుడుగా ప్రియ దర్శకుడుగా మారిపోయిన బాబి టాలెంట్ చూసి సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి పిలుపు వచ్చిన సందర్భం తెలిసిందే. రజనీకాంత్ పిలుపుతో జోష్ లోకి వెళ్ళిపోయిన బాబి అతడికి ఒక పవర్ ఫుల్ స్టోరీని వినిపించినప్పటికీ ఆకథ పూర్తిగా రజనీకాంత్ కు నచ్చకపోవడంతో ఆమూవీ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడింది.

 

 

అయితే ఇప్పుడు అదే కథ బాలకృష్ణకు నచ్చింది అన్నప్రచారం జరుగుతోంది. ఈమూవీ కథ బాలయ్యకు నచ్చడంతో బాబి బాలయ్యల కాంబినేషన్ మూవీకి సంబంధించిన ప్రకటన ఈనెల 10వ తారీఖున బాలకృష్ణ పుట్టినరోజునాడు అధికారికంగా ప్రకటిస్తారు అని అంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం బోయపాటి దర్శకత్వం మూవీని చేస్తున్న బాలకృష్ణ ఆమూవీకి సంబంధించిన వర్క్ సెప్టెంబర్ తో పూర్తి అవుతోంది.

 

 

దీనితో అక్టోబర్ నుండి మొదలుపెట్టి డిసెంబర్ చివరకు బాలకృష్ణ బాబికి 80 రోజుల కాల్ షీట్స్ ఇచ్చినట్లు సమాచారం. వాస్తవానికి అనీల్ రావిపూడితో మూవీ తరువాత బాలయ్య బోయపాటి కాంబినేషన్ మూవీ ‘అఖండ 2’ ఉంటుందని అంతా భావించారు. అయితే బోయపాటి ఈ మూవీకి సంబంధించి బాలకృష్ణ డేట్స్ సుమారు 100 రోజులు పైగా అడిగిన నేపధ్యంలో మధ్యలో ఎన్నికల క్లాష్ వస్తుంది కాబట్టి వేగంగా బాబి సినిమాను పూర్తిచేసి ఆతరువాత ఎన్నికలు పూర్తి అయ్యాక బోయపాటి మూవీ వైపు అడుగులు వేయాలని బాలయ్య ఆలోచన అని అంటున్నారు.

 

 

బాలయ్య బాబికి ఓకె చెప్పడంతో బాబికి సన్నిహితుడైన కోన వెంకట్ రంగంలోకి దిగి బాలయ్య ప్రాజెక్ట్ కు సంబంధించిన కథను ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమూవీ కథ కూడ కొంతవరకు రాజకీయాలు చుట్టూ తిరిగే పవర్ ఫుల్ సబ్జెక్ట్ కాబట్టి ఈమూవీలో భారీ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ ఉండే ఆస్కారం కనిపిస్తోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ బోయపాటి బాలయ్యల మూవీ ఆలస్యం బాబికి అదృష్టంగా మారింది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: