స్వర్గీయ నందమూరి తారక రామారావు మరణం తర్వాత తెలుగుదేశం పార్టీని నిలబెట్టే ఏకైక వారసుడు తారక్ అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అని తెలుగుదేశం పార్టీని చేతుల్లోకి తీసుకొని అధిష్టించాలి అని.. ఒక నందమూరి అభిమానులు మాత్రమే కాదు యావత్ రాష్ట్ర ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పొలిటికల్ ఎంట్రీ కి దూరంగానే ఉంటున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరఫున ప్రచారం చేసిన ఎన్టీఆర్ అప్పుడే తనలోని రాజకీయ నాయకుడిని కూడా ప్రజలకు పరిచయం చేశాడు.

ఆ సమయంలో ఆయన చేసిన పర్యటన ప్రసంగాలు ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించాయి. ఇకపోతే ఆ ఎన్నికలలో టిడిపి ఓడిపోయినా సరే ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు మాత్రం ప్రజల్లో మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాయని చెప్పవచ్చు. అదే సమయంలో ఎన్టీఆర్ ను నారా వారు పట్టించుకోలేదని అందుకే ఆయన రాజకీయాలకు దూరం అవుతూ వచ్చారు.. అవసరమైనప్పుడు మాత్రమే పార్టీకి అండగా ఉంటానని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు కూడా పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారా అన్న అనుమానం కూడా మొదలయ్యింది.

ఒక వైపు లోకేష్ ను హైలెట్ చేయడానికి తారక్ ను పార్టీకి దూరంగా ఉంచుతూ చంద్రబాబు ప్రణాళిక చేస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.  ప్రస్తుతం టిడిపికి ఈసారి ఎన్నికల్లో గెలవడం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ ఈసారి కూడా ఓడిపోతే టిడిపి మరింత బలహీన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఎలాగైనా సరే వచ్చే ఎన్నికలలో టిడిపి పార్టీని గెలిపించి తన కొడుకు లోకేష్ ను సీఎం చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈసారి ఎన్నికలే తమకు చివరివని ఇప్పటికే చంద్రబాబు కూడా క్లారిటీ ఇచ్చారు అందుకే ఎలాగైనా సరే సీఎం పదవిని లోకేష్ కట్ట పెట్టాలని ఇక ఆయన రాజకీయాలకు రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకున్నప్పటికీ.. లోకేష్ కి  సీఎం అయ్యే అర్హత ఉందా అంటే మాత్రం చాలామంది ఒప్పుకోవడం లేదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుకుంటున్నారు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెడితే కచ్చితంగా లోకేష్ పని అయిపోయినట్టే అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: