తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అయిన అక్కినేని నాగచైతన్య నటించిన 'కస్టడీ' సినిమా మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కాప్ డ్రామా  డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో జూన్ 9, 2023 నుండి OTT ప్లాట్‌ఫారమ్‌లో ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ ఇంకా అలాగే మలయాళ భాషలలో కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది అని సమాచారం తెలుస్తుంది.కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో నాగచైతన్య సరసన యంగ్ బ్యూటీ కృతి శెట్టి జోడిగా కనిపించనుంది. అలాగే ఈ సినిమాలో అరవింద్ స్వామి, ప్రియమణి, నరేష్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, శరత్ కుమార్ ఇంకా ప్రేమి విశ్వనాధ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఈ తెలుగు-తమిళ సినిమాకి ఇళయరాజా ఇంకా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ నిర్మించింది.ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.ఇక విడుదలైన అన్ని చోట్ల కూడా ఈ సినిమా మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ఆఫీస్ వద్ద కేవలం 6.79 కోట్లు మాత్రమే వసూళ్లు చేసినట్లు సమాచారం తెలుస్తుంది.దాదాపు 20 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాకి భారీగా నష్టాలు వచ్చాయి.రేపు డిజిటల్ రిలీజ్ లో అయిన ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.ఈ సినిమాతో భారీగా దెబ్బ తిన్న నాగ చైతన్య ఇక తన తరువాత సినిమా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ చందు మొండేటి తో చేస్తున్నాడు. ఈ సినిమా కోసం చైతూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: