ఒకప్పుడు పురాణాలు ఆధారంగా తీయబడ్డ సినిమాలకు జానపద సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది. ముఖ్యంగా నందమూరి తారకరామారావు ని దేవుడుగా మార్చిన పురాణాలు ఇతిహాసాల సినిమాలు ఒకప్పుడు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆతరువాత ట్రెండ్ మారిపోవడంతో క్రైం హారర్ సస్పెన్స్ సినిమాల హవా కొనసాగింది.

 

 

సెంటిమెంట్ సినిమాలు బాగుంటే జనం అన్ని కాలాలలోనూ చూస్తున్నారు. లేటెస్ట్ గా బయోపిక్ సినిమాల హవా ప్రారంభం అయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎవరూ ఊహించని విధంగా ప్రభాష్ ‘ఆదిపురుష్’ మూవీకి నేటితరం ప్రేక్షకులలో ఏర్పడిన మ్యానియా చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ఈసినిమా ఊహించిన విధంగా బ్లాక్ బష్టర్ హిట్ అయితే మరిన్ని రామాయణ గాధలు సినిమాలుగా వచ్చే ఆస్కారం ఉంది అన్నసంకేతాలు వస్తున్నాయి.

 

 

బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ నితీష్ తివారి రామాయణం ఆధారంగా ఒక భారీ మూవీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టే ఆస్కారం ఉంది అని వార్తలు వస్తున్నాయి. ‘దంగల్’ మూవీ దర్శకుడుగా ఎన్నో అవార్డులు అందుకున్న నితీష్ తివారి ఇప్పుడు రామాయణ గాధను సినిమాగా తీయడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం రావణాసురుడు పాత్రను హైలెట్ చేస్తూ ఈ రామాయణం ఉంటుంది అంటున్నారు.

 

 

హృతిక్ రోషన్ రావణుడు గా దీపికా పదుకొనె లేదంటే సాయి పల్లవి లు సీత పాత్రలో నటిస్తే రణబీర్ కపూర్ శ్రీరాముడు గా నటిస్తాడని అంటున్నారు. సుమారు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలతో నిర్మాణం జరుపుకునే ఈమూవీ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి అని టాక్. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించే ఈమూవీకి అల్లు అరవింద్ సహనిర్మాతగా వ్యవహరించే ఆస్కారం ఉంది అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అంతా ‘ఆదిపురుష్’ ఫైనల్ రిజల్ట్ పై ఆధారపడి ఉండవచ్చు అన్న సంకేతాలు వస్తున్నాయి..

 


మరింత సమాచారం తెలుసుకోండి: