
నాగార్జున-అమల:
స్టార్ హీరో నాగార్జున, హీరోయిన్ అమల.. శివా సినిమాలో నటించి హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకొని రియల్ లైఫ్ జంటగా మారిన విషయం తెలిసిందే.
కృష్ణ - విజయనిర్మల :
సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో చిత్రాలను తీసినప్పటికీ అందులో విజయనిర్మల దర్శకత్వంలోనే ఎక్కువగా సినిమాలను తెరకెక్కించారు. మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరూ కలిసి ఆన్ స్క్రీన్ హిట్ ఫెయిర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇక తర్వాత వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
శ్రీకాంత్ - ఊహ :
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు విలన్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న హీరో శ్రీకాంత్ ఊహతో కలిసి పలు చిత్రాలలో నటించి ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నారు.
రాజశేఖర్ - జీవిత రాజశేఖర్ :
యాంగ్రీ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్.. జీవిత దర్శకత్వంలో పలు చిత్రాలలో నటించారు. అంతేకాదు ఆమె హీరోయిన్గా నటించిన చిత్రాలలో ఈయన విలన్ గా చేసి మెప్పించారు. అలా వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.
నమ్రత - మహేష్ బాబు :
సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ సినిమాలో నమ్రతా సరసన నటించి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ప్రేమించుకొని ఇంట్లో ఎవరికీ తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు.
ఇక వీరితోపాటు పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్, నాగచైతన్య - సమంతలు కూడా ఇలాగే పెళ్లిళ్లు చేసుకున్నారు కానీ విడాకులు తీసుకొని విడిపోయారు. తరువాత ఆది పినిశెట్టి , నిక్కి గర్లాన్ని కూడా ఒకే సినిమాలో నటించి ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి కూడా పెళ్లికి సిద్ధమవుతున్నారు.