
ఇంకోపక్క సినిమాలలో కొరియోగ్రాఫర్ గా కూడా చేస్తూ ఉన్నాడు. అయితే ఇక ఈ మధ్య ఆట సందీప్ హీరోగా కూడా మారిపోయాడు. ఏకంగా ఆట సందీప్ హీరోగా ఆయన భార్య జ్యోతి రాజ్ హీరోయిన్లుగా ఒక చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాకు లవ్ యు టూ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. యోగి క్యూమర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది అని చెప్పాలి. పెళ్లి తర్వాత ఒక మగాడు ప్రేమించవచ్చా అనే పాయింట్ మీద ఈ సినిమాను నడిపించారు. ఇకపోతే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది.
ఇకపోతే ఇటీవలే ప్రెస్ మీట్ లో ఆట సందీప్ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. పెళ్లి తర్వాత నిజంగానే లవ్ చేయొచ్చా అంటూ ఓ రోజు నా భార్య నన్ను అడిగింది. పెళ్లయిన తర్వాత లవ్ చేయకూడదు అన్న రూల్ లేదు. ఎఫైర్ ఉండొచ్చు.. కాకపోతే జెన్యూన్ గా ఉండాలి. నేను నా భార్య దగ్గర క్లియర్ చేసుకుంటా.. నాన్న నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది ముగ్గురం కలిసి ఓకే ఇంట్లో ఉందాం అని జెన్యూన్ గా చెప్తా.. అన్ని తనకు చెప్పే చేస్తాను అంటూ ఆట సందీప్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో నా భార్య ముందు ముద్దు పెట్టే శీను ఉంటుంది. అప్పుడు నేను భయపడితే ఆమె దగ్గరుండి మరి ముద్దు పెట్టించింది అంటూ చెప్పుకొచ్చాడు సందీప్.