ఓం రౌత్ భారీ బడ్జెట్ తో తెరకెకెక్కించిన అది పురుష్ చిత్రం ఈనెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే . ఈ చిత్రం రామాయణం కథ అంశంతో తెరకెక్కించారని తెలుస్తుంది..ఇందులో ప్రభాస్ రాముడు పాత్ర లో కనిపించగా సీత పాత్ర లో కృతి సనన్ నటిస్తోంది.
రావణాసుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్ ట్రైలర్ లో ని పాత్రలు అందరిని కూడా బాగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది మాత్రం వీటి పైన నెగిటివ్ కామెంట్లు చేస్తూనే ఉన్నారు.

గ్రాఫిక్స్ సంబంధించిన కొన్ని షాట్స్ విషయం లో నెగిటివ్ కామెంట్లు చేయడం అభిమానులను కాస్త బాధ పెట్టించేలా చేస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా నటి కస్తూరి శంకర్ ఆది పురుష్ పోస్టర్ల గురించి నెగిటివ్ కామెంట్స్ చేసారు.ప్రస్తుతం ఆ కామెంట్స్ బాగా వైరల్ గా మారుతున్నాయి.. రామ లక్ష్మణులను మీసాలు గడ్డాలతో చూపించే సాంప్రదాయం ఎక్కడైనా ఉందా అంటూ కస్తూరి శంకర్ కామెంట్ చేసింది... ఈ విధంగా కలవర పెట్టే మార్పులను ఎందుకు చూపించారని ఆమె ప్రశ్నించడం జరుగింది.. తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది లెజెండ్రీ నటులు రాముని పాత్రను పూర్తి స్థాయి లో పరిపూర్ణం గా తెరకెక్కించారు అంటూ ఆమె ప్రశ్నించింది.

ఆది పురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడి లా కాకుండా ఒక కర్ణుడిలా కనిపిస్తున్నారంటు కామెంట్లు కూడా చేస్తోంది.అయితే ఈ విషయం పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆమెను బాగా ట్రోల్ చేస్తున్నారు. కస్తూరి శంకర్ ప్రస్తుతం పలు సీరియల్స్ తో చాలా బిజీగా ఉన్నది. అయితే అభిమానులు మాత్రం రాముని పాత్రలో ప్రభాస్ కు మీసాలు గడ్డాలతో చూడటానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వారు తెలియజేస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి పనులను కూడా పూర్తి చేసింది ఆదిపురుష్ టీం

మరింత సమాచారం తెలుసుకోండి: