తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అల్లరి నరేష్ తాజాగా ఉగ్రం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి విజయ్ కనకమెడల దర్శకత్వం వహించాడు. ఇది వరకే వీరి కాంబినేషన్ లో రూపొందిన నాంది మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఉగ్రం మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. ఈ మూవీ యొక్క క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో 1.20 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 46 లక్షలు , యూఏ లో 39 లక్షలు , ఈస్ట్ లో 25 లక్షలు , వెస్ట్ లో 16 లక్షలు , గుంటూరు లో 25 లక్షలు , కృష్ణ లో 26 లక్షలు , నెల్లూరు లో 14 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.11 కోట్ల షేర్ ... 6.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్ సీస్ లో కలుపు కొని ఈ మూవీ కి 34 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 3.45 కోట్ల షేర్ ... 7.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 5.80 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 6.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ కి మొత్తంగా 3.05 కోట్ల నష్టాలు వచ్చాయి. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: