తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగబాబు కుమారుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు అనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.. అయితే గడిచిన వారం క్రితం నుంచి వీరిద్దరి వివాహం జరగబోతోంది అంటూ టాలీవుడ్లో తెగ వార్తలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు వీరి నిశ్చితార్థం నిన్నటి రోజున రాత్రి జరిగినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను వరుణ్ తేజ్ లావణ్య షేర్ చేయడం జరిగింది.

 
నిన్నటి రోజున రాత్రి 8 గంటలకు నాగబాబు నివాసంలో వీరి నిశ్చితార్థం జరిగినట్టుగా తెలుస్తోంది.. అయితే వీరి నిశ్చితార్థానికి మెగా కుటుంబ సభ్యులు లావణ్య కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్టుగా తెలుస్తోంది. వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వరుణ్ తేజ్ గాండీవధారీ అర్జున చిత్రంలో నటిస్తూ ఉన్నారు. లావణ్య త్రిపాఠి చివరిగా పులిమేక అనే వెబ్ సిరీస్లో నటించి బాగానే ఆకట్టుకుంది. లావణ్య త్రిపాఠి ఇంస్టాగ్రామ్ ద్వారా ఇలా షేర్ చేస్తూ వరుణ్ లావణ్య లవ్ దొరికింది అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేయడమే కాకుండా కాబోయే పెళ్లికూతురు లావణ్య అని కూడా ఇదే ఫోటోలను షేర్ చేశారు..
2016 నుంచి తమ ఇద్దరి ప్రేమ ఉన్నట్లుగా తెలియజేసింది లావణ్య త్రిపాఠి.ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన వరుణ్ తేజ్ ఆ తర్వాత డైరెక్టర్ కృష్ణ తెరకెక్కించిన కంచే చిత్రంతో మంచి నటుడుగా పేరు సంపాదించారు.. వరుణ్ తేజ్, లావణ్య ఇద్దరు కలిసి మిస్టర్ ,అంతరిక్షం అంటే సినిమాలలో నటించారు రెండు సినిమాలు షూటింగ్ చేస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నట్లు సమాచారం. వివాహం తర్వాత మరి లావణ్య త్రిపాఠి సినిమాలకు దూరంగా ఉంటుందేమో చూడాలి మరి ప్రస్తుతం ఈ జంటని సైతం పలువురు నేటిజన్లు అభిమానులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: