నితిన్ హీరోగా సమంత ... అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొంత కాలం క్రితం "అ ఆ" అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా ... రావు రమేష్ ... నరేష్ ... నదియా ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ సినిమా అప్పట్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమా నితిన్ కు కూడా మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఈ సినిమా ద్వారా అనుపమ పరమేశ్వరన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించిన అనుపమ కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించింది.

మూవీ తర్వాత అనుపమ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ సినిమా అవకాశాలు దక్కాయి. ఇలా అప్పట్లో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను మొదట త్రివిక్రమ్ ... నితిన్ తో కాకుండా మరో హీరోతో అనుకున్నాడట. కాకపోతే ఆ హీరో కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను చేయకపోవడంతో నితిన్ తో ఈ మూవీ ని తీసాడట. ఆ హీరో ఎవరు ..? ఎందుకు ఆ సినిమాలో నటించలేక పోయాడు అనే విషయాలను తెలుసుకుందాం. 

మొదట త్రివిక్రమ్ "అ ఆ" మూవీ కథను టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య కు వినిపించాడట. ఈ మూవీ కథ కూడా నాగ చైతన్య కు అద్భుతంగా నచ్చిందట ... కాకపోతే అదే సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ కి డేట్ లను అడ్జస్ట్ చేయలేకపోయాడట. అలా "అ ఆ" మూవీ కథ నచ్చినప్పటికీ ఇతర మూవీ లతో బిజీగా ఉండడం వల్ల నాగ చైతన్యమూవీ లో నటించ లేక పోయాడట. దానితో త్రివిక్రమ్ ... నితిన్ లో ఈ మూవీ ని రూపొందించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: