తన రెండుపడవల సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. తన పార్టీ ఫండ్స్ కొరకు సినిమాలు చేస్తున్నాను అంటూ ఓపెన్ గానే చెపుతున్న పవన్ తాను ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేసే విషయంలో తన కమిట్మెంట్ ను పూర్తి చేసే విషయంలో ఖచ్చితంగా వ్యవహరించలేక పోతున్నాడు అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఇప్పటికే తాను నటిస్తున్న ‘బ్రో’ సినిమాను పూర్తిచేసిన పవన్ ‘హరిహర వీరమల్లు’ ను గాలిలోకి వదిలేసాడు అన్నవిమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘ఓజీ’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు పూర్తికాకుండానే మరొక సినిమాకు ఓకె చెప్పాడు అన్నవార్తలు వస్తున్నాయి. ‘బ్రో’ సినిమాకు దర్శకత్వం వహించిన సముద్రఖని దర్శకత్వ ప్రతిభ పవన్ కు బాగా నచ్చడంతో అతడితో మరొక సినిమాను చేస్తాను అని మాటఇవ్వడమే కాకుండా దానికి సంబంధించిన కథను ఎంచుకోమని సముద్రఖని కి పవన్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.


వాస్తవానికి పవన్ ఈనెల 14 నుండి తన వారాహి రథం పై జనచైతన్య యాత్ర ప్రారంభించబోతున్నాడు. అన్నవరం నుండి మొదలుపెట్టే ఈ వారాహి యాత్ర పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వరకు కొనసాగే ఆస్కారం ఉంది. ఈ యాత్ర సక్సస్ ను బట్టి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలోను పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్ర చేపట్టే ఆలోచనలు చేస్తున్నాడు.


దీనితో ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాల షెడ్యూల్స్ లో చాలమార్పులు వచ్చే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ కొత్త సినిమాలకు పవన్ లిస్టులో ఖాళీ ఎక్కడ ఉంది అంటూ చాలమంది ఆశ్చర్యపడుతున్నారు. ప్రస్తుతం సినిమాల విషయంలో తన పద్ధతి మార్చుకున్న పవన్ కళ్యాణ్ తన దగ్గరకు వచ్చే దర్శకులతో తనతో తీసే సీన్స్ 30 రోజులలో పూర్తి చేయాలనే కండిషన్స్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య పవన్ మనసులో సముద్రఖని కి మరొక అవకాశం ఇవ్వాలి అనుకున్నప్పటికీ అది ఇప్పట్లో నెరవేరే ఆస్కారం లేదు అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: