పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  ప్రస్తుతం భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. మరొక వారం లో ఆదిపురుష్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు..

సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.. ఇక ప్రభాస్ లైనప్ లో నెక్స్ట్ విడుదల కాబోతున్న సినిమా పాన్ ఇండియన్ మూవీ ''సలార్''.

కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి.. ఈ ఏడాది సెప్టెంబర్ లో నే విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి తరచూ ఏదొక వార్త వస్తూనే ఉంది.. మరి తాజాగా ఈ సినిమా బిజినెస్ భారీ మొత్తంలో జరుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ భారీ బిజినెస్ జరుపుకుని సెన్సేషన్ క్రియేట్ చేయగా ఇప్పుడు సలార్ సినిమాకు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ పోటీ నెలకొన్నది.. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయని సమాచారం... వీటిలో ఆదిపురుష్ హక్కుల ను కొనుగోలు చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఉందని సమాచారం.అలాగే గీతా ఆర్ట్స్ వంటి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు సలార్ హక్కుల కోసం తెగ పోటీ పడుతున్నాయని రూమర్స్ కూడా వస్తున్నాయి. మరి చివరకు సలార్ హక్కుల ను ఎవరు ఎంత మొత్తానికి దక్కించు కుంటారో అయితే వేచి చూడాలి.. ఇక ఈ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హోంబలే వారు భారీ స్థాయి లో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాను సెప్టెంబర్ 28 న రవిడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ కూడా ..ఈ సినిమాను భారీగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా లో ప్రభాస్ రెండు విభిన్న పాత్రలు చేయబోతున్న విషయం తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: