
ఇలా ఇన్ని డ్యూయెల్ రోల్స్ చేసి బాలయ్య అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసాడు.. ఈయన ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు చాలా వరకు బాగానే హిట్ అయ్యాయి.. ఈ మధ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలో కూడా బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో నటించాడు.. మరి ఇప్పటి హీరోలు ఇలాంటి రికార్డ్ నెలకొల్పడం అంటే అసాధ్యం అనే చెప్పాలి.. బాలయ్య కవల సోదరుడి గా, తండ్రి తనయుడిగా, తాత మనవళ్లుగా, బావ బామ్మర్దులుగా, రాజుగా, సామాన్యుడి గా, భగవంతుడి గా, భక్తుడి గా పాత్రల్లో డ్యూయెల్ రోల్లో నటించి మెప్పించాడు.. మొత్తాని కి ఎవ్వరికి సాధ్యం కానీ రికార్డ్ అయితే ఈయన పేరు మీద ఉంది.. ఇదిలా ఉండగా ప్రజెంట్ నందమూరి బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా నుండి బర్త్ డే కానుక గా టీజర్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది..