అఖండ వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ విజయాల తరువాత బాలయ్య నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ నిలిచిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ కి జోడిగా కాజర్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది .అంతేకాదు టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీ లీల ఈ సినిమాలో బాలకృష్ణకి కూతురుగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన 70% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా

 ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వీడియోని విడుదల చేశారు చిత్ర బృందం.కాగా ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది .బాలకృష్ణ ఈ సినిమాతో మరొకసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం కన్ఫామ్ అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓటిపిడి అప్పుడే పూర్తయిందని అంటున్నారు. బాలకృష్ణ కెరియర్ లోనే 18 కోట్ల రూపాయలకు పైగా ఓటీటి రైట్స్ అమ్ముడుపోయిన ఏకైక సినిమా ఇదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాని

 డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంస్థ 15 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే .కాగా ఈ సినిమా వాళ్లకి బాగా గిట్టుబాటు అయింది. అందుకే తాజాగా ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాని కూడా వారే భారీ రేట్ కి కొనుగోలు చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటి లో విడుదల చేసుకునే రైట్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాకపోయినప్పటికీ నాలుగు వారాల తర్వాతే ఓటీడీలో అప్లోడ్ చేస్తారని తెలుస్తోంది. ఈ షరతు పైనే మేకర్స్ ఒప్పందం కుదిరించుకున్నారట. ఇటీవల అఖండ విరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ ఇప్పుడు ఈ సినిమాతో కూడా మరొకసారి హ్యాట్రిక్ కొడతాడా లేదా అన్నది చూడాలంటే ఈ సినిమా విడుదల అయ్యేంతవరకు ఎదురుచూడాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: