రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో నటించి ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా తాజాగా జూన్ 16 వ తేదీన థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి మొదటి రోజు భారీ మొత్తంలో కలక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 13.68 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 3.52 , యుఏ లో 3.72 కోట్లు , ఈస్ట్ లో 2.78 కోట్లు , వెస్ట్ లో 2.24 కోట్లు , గుంటూరు లో 4 కోట్లు , కృష్ణ లో 2 కోట్లు , నెల్లూరు లో 90 లక్షల కలక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 32.84 కోట్ల షేర్ ... 49.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి కర్ణాటక లో మొదటి రోజు 4.65 కోట్ల కలక్షన్ లు దక్కగా ... తమిళ నాడు లో 76 లక్షలు , కేరళ లో 26 లక్షలు , హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 18.80 కోట్లు , ఓవర్ సీస్ లో 12.8 కోట్ల కలక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 70.13 కోట్ల షేర్ ... 137 కోట్ల గ్రాస్ కలక్షన్ లు దక్కాయి. ఇక కృతి సనన్మూవీ లో హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి ఓం రౌత్ దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: