ఇక ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తూ ఉండడం గమానార్హం. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 50% పూర్తయింది. అయితే ప్రభాస్ క్రేజ్ దృశ్య సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ సెట్ కాలేదు అని గతంలో టాక్ వినిపించింది. అయితే ఇక టైటిల్ చేంజ్ చేసే పనిలోపడ్డాడట డైరెక్టర్ మారుతి. అంబాసిడర్ లేదా రాయల్ అనే టైటిల్ లను పరిశీలిస్తున్నారట
అయితే రాజా డీలక్స్ లేదా రాయల్ అనే టైటిల్స్ లలో ఏదో ఒకటి ఫైనలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది. లేదంటే మరేదైనా బెటర్ టైటిల్ ఖరారు అవుతుందా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రభాస్ కోసం హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి కథను రాసుకున్నాడట మారుతి. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజా డీలక్స్ సినిమా ఒక థియేటర్ బ్యాక్ గ్రౌండ్ లో ఉంటుందట. ఇక ఈ సినిమాలో ప్రభాస్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తాత మనవళ్ళుగా కనిపించబోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి