పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ జి అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని అర్థం. అందుకే పవన్ కళ్యాణ్  సినిమాకి ఏ సినిమాకి లేనంత బజ్ ఏర్పడింది. కానీ ఇప్పుడు పవర్ స్టార్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ కాదన్న వార్త వినపడుతోంది. ఈ క్రమంలోనే ఓజి అంటే అర్థం ఏంటా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే సాధారణంగా తమ తమ హీరోల్ని ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటూ హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు తమ అభిమానులు. ముఖ్యంగా మెగా అభిమానులు రాం చరణ్ ని ఓజి అంటూ పిలుస్తూ ఉంటారు. అదే టైటిల్తో బాబాయి పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలో నెలకొన్నాయి.

ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో అప్పటినుండి ఈ సినిమాపై రోజురోజుకీ హైప్ పెరుగుతూనే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఓజి సినిమాపై వస్తున్న హైప్ మరే సినిమాకి రావడం లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సుజిత్ దర్శకత్వంలో డివిపి ఎంటర్టైన్మెంట్స్ వారు ఓజి సినిమాని ఊహించని విదంగ  తెరకెక్కిస్తున్నారు. కిక్ ఇచ్చే అప్డేట్లతో ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలను పెంచేశారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి కాదన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

అయితే ఈ సినిమాని ఓజి అనే వర్కింగ్ టైటిల్ తో మొదలుపెట్టారు అని కానీ దీన్ని టైటిల్ గా ఫిక్స్ కాలేదు అన్న వార్తలు వినబడుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓజి అంటే ఓజాస్ గంభీర అని అంటున్నారు. దాన్ని షార్ట్ గా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా మార్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఓజి అనేది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు అని అంటున్నారు. ఇక ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు గానీ ఓ జి అనే టైటిల్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు అర్జున్ దాస్ మరియు ఇమ్రాన్ హస్మీ కూడా నటిస్తుండడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: