యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తన కెరీర్ లో ఇప్పటి వరకు నటించిన సినిమా లలో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 3 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా నటించగా ... దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ... రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను అందించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , హిందీ , మలయాళ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

బాహుబలి : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా తమన్నా , అనుష్క హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

సాహో : బాహుబలి ... బాహుబలి 2 లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 430 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో శ్రద్ధ కపూర్ ... ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించగా ... సుజిత్మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: