ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు హీరో ఉదయ్ కిరణ్. చిత్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉదయ్ కిరణ్ మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో వరుసగా అవకాశాలు అందుకున్నాడు. ఇక ఆ తర్వాత టాలీవుడ్ లవర్ బాయ్ గా కూడా పేరు సంపాదించుకున్నాడు ఈ హీరో. అయితే కెరియర్ లో స్టార్ హీరోగా ఎదిగి ఉన్నత స్థానానికి చేరుకుంటాడు అనుకునే లోపే చివరికి వరుస ప్లాపులు రావడం.. అంతలోనే ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో చివరికి మనస్థాపంతో  ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు.


 అయితే ఉదయ్ కిరణ్ ఈ లోకంలో లేకపోయినప్పటికీ అటు ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం చెరగని ముద్ర వేసుకున్నారు అని చెప్పాలి. అయితే ఉదయ్ కిరణ్ మాత్రమే కాదు ఆయనతో కలిసి నటించిన ఎంతోమంది సహానటులు కూడా ప్రస్తుతం ప్రాణాలతో లేరు అన్న విషయం చాలామందికి తెలియదు. అది కూడా ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన సూపర్ హిట్  మూవీ నువ్వు నేను సినిమాలో నటించిన వారు అందరూ కూడా చనిపోయారు అని చెప్పాలి. అప్పట్లో నువ్వు నేను ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2001లో విడుదలైన ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు.


 అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇక కీలక పాత్రలో నటించినా ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా ఇప్పుడు ఈ లోకంలో లేరు. వీళ్లు మాత్రమే కాకుండా కమెడియన్ ఎమ్మెస్ నారాయణ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆహుతి ప్రసాద్, వైజాగ్ ప్రసాద్ కూడా మరణించారు అని చెప్పాలి. ఇలా ఓకే సినిమాలో నటించి సూపర్ హిట్ సాధించిన ఈ నటులందరూ కూడా ఇప్పుడు ఈ లోకంలో లేకపోవడం నిజంగా బాధాకరమే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: