టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న శ్రీవిష్ణుకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ మాత్రం పడటం లేదు.తాజాగా శ్రీ విష్ణు 'సామజవరగమన' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళని రాబడుతూ ఒక రేంజ్ లో ఇరగదీస్తోంది.బాక్సాఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్‌తో ఎక్స్ లెంట్ వసూళ్లను రాబడుతోంది. వరుస ఫ్లాఫ్స్‌తో సతమతం అవుతున్న శ్రీ విష్ణుకు ఈ సినిమాతో ఓ బంపర్ హిట్ పడిందనే చెప్పోచ్చు. టాక్ తో సంబంధం లేకుండా శ్రీ విష్ణు విక్టరీ వెంకటేష్ లాగా అన్ని వర్గాల వారిని మెప్పించే స్టోరీలు చేస్తున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటి దాకా ఏకంగా 10 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అధిగమించి దుమ్ము లేపింది. కేవలం నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో 3.71 కోట్ల షేర్‌ను, 6.45 కోట్ల గ్రాస్‌ను అందుకోని అందరి చేత వావ్ అనిపించింది.


ఇక వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 5.41 కోట్ల షేర్‌ను 10.10 కోట్ల గ్రాస్‌ను అందుకుని వావ్ అనిపించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగగా కేవలం ఈ 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని.. ఏకంగా 1.91 కోట్ల రేంజ్‌లో ప్రాఫిట్‌ను సొంతం చేసుకొని పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇంకా ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా.. రెబ్బా మోనిక జాన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో నరేష్, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో కనిపించారు. ఇక ఈ సినిమాను చూసిన పలువురు సినీ ప్రముఖులు, సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.ఇక శ్రీవిష్ణు గత సినిమాల విషయానికి వస్తే.. అతను నటించిన కొన్ని సినిమాలు పెద్దగా అలరించలేకపోయాయి. ఇక శ్రీ విష్ణు నుంచి సినిమా వస్తుందంటే.. ఏదో కొత్త తరహా సబ్జెక్ట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో బాగా పాతుకు పోయింది.'గాలి సంపత్' 'రాజ రాజ చోర'తో పాటు ఆ తర్వాత 'అర్జున ఫల్గుణ' సినిమాతో ప్రేక్షకులు ముందకు వచ్చారు. ఆ తర్వాత 'భళా తందనాన', అల్లూరి సినిమాలతో ఆడియన్స్ ముందకు వచ్చి ఆకట్టుకున్నాడు.అయితే కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: