తెలుగు, తమిళ భాషల్లో నెంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా అనుష్క శెట్టి ఓ రేంజ్ లో స్టార్ డం సంపాదించుకుంది. స్టార్ హీరోలకి పోటీగా క్రేజ్ ని సొంతం చేసుకుంది. తెలుగు తమిళనాట ఎన్నో లక్షల మంది అభిమానులని సంపాదించుకుంది. స్వీటీ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయ్యింది. మన తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అనుష్క. ఇక ఈ హాట్ బ్యూటీ చేసిన అరుంధతి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.లేడీ ఓరియెంటెడ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా తర్వాత బాహుబలి తో ఏకంగా పాన్ ఇండియా క్రేజ్ ని కూడా సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత భాగమతి అనే మూవీలో నటించింది. ఆ సినిమా తర్వాత నిశ్శబ్దం అనే లో నటించింది.అయితే ఆ రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.


ఇక ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది అనుష్క. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి  ఈ మూవీలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 4న ఈ మూవీ విడుదల కానుంది.ఈ మూవీలో నవీన్ స్టాండప్ కమెడియన్ గా నటిస్తుండగా ఇక అనుష్క చెఫ్ గా నటిస్తుంది.ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. జాతిరత్నాలు మూవీతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు హీరో నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్ళని రాబట్టి నవీన్ పోలిశెట్టికి మంచి గుర్తింపుని తెచ్చిట్టింది.తన కామెడీ టైమింగ్ తో యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాడు. ఇక ఈ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు కూడా క్రియేట్ అయ్యాయి. చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: