పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవర్ స్టార్ నేమ్ కి తగ్గట్టే ఆయన క్రియేట్ చేసే రికార్డులు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి.ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.ఇక నిన్నటినుంచి పవర్ స్టార్ తెగ ట్రెండింగ్ లో వున్నారు. ఆది ఎందుకో అందరికి తెలిసిన విషయమే..ఇక నిన్న ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అసలు తెలుగు హీరోల్లో ఎవరికీ సాధ్యం కానీ అరుదైన రికార్డు ని నెలకొల్పాడు. అదేమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న ఇంస్టాగ్రామ్ లోకి అడుపెట్టిన అతి తక్కువ సమయం లోనే 1 మిలియన్ కి పైగా ఫాలోవర్లని సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ రికార్డు తెలుగు హీరోలు ఎప్పుడు కొట్టలేకపోయారు.పొద్దున 11 గంటల సమయం లో ఆయన ఇంస్టాగ్రామ్ లోకి రాగా, సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాలకు ఏకంగా 1 మిలియన్ ఫాలోయర్స్ మార్కుని దాటేసారు.


మన టాలీవుడ్ హీరోలకు ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టి 1 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది.కానీ పవన్ కళ్యాణ్ కేవలం తక్కువ గంటల వ్యవధిలోనే ఈ మార్కుని అందుకొని టాలీవుడ్ తరపున సరికొత్త చరిత్ర సృస్టించాడు. ప్రపంచం లోనే అత్యంత వేగవంతంగా 1 మిలియన్ ఫాలోవర్స్ ని దక్కించుకున్న టాప్ 10 సెలబ్రిటీస్ లో ఒకడిగా పవన్ కళ్యాణ్ నిలిచాడు. ‘వీ ఆఫ్ BTS’ కేవలం 43 నిమిషాల్లో 1 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ని దక్కించుకొని టాప్ 1 స్థానం లో నిలవగా, ఏంజిలీనా జోలీ 59 నిమిషాలతో టాప్ 2 ఇంకా తమిళ హీరో విజయ్ 99 నిమిషాల్లో టాప్ 3 , ఏం -టెయ్ ఇల్ కి ఒక గంట 45 నిమిషాలలో టాప్ 4 అలా ఎంతో మంది వరల్డ్ టాప్ స్టార్స్ లిస్టులో J అనిస్టన్ తర్వాతి స్థానం లో టాప్ 9 గా 6 గంటల 20 నిమిషాల వ్యవధి లో 1 మిలియన్ ఫాలోవర్స్ ని దక్కించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: