వేరు వేరు దారులను ఎంచుకుంటూ విభిన్నమైన జానర్స్ లో సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించారు.నాగార్జున క్లాస్ , యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తే, బాలయ్య బాబుకి ఊర మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది.ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ మరియు నాగేశ్వరరావు ఆరోజుల్లో ఎంతో మంచి స్నేహం గా ఉండేవారు.వీళ్లిద్దరి మధ్య స్నేహం అన్నదమ్ముల తో సమానంగా ఉండేది.అందుకే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఆరోజుల్లో అన్ని సినిమాలు వచ్చాయి.కెరీర్స్ ని ప్రారంభించిన కొత్తల్లో ఇద్దరు స్నేహం గానే ఉండేవారు కానీ, కాలం గడుస్తున్న కొద్దీ వీళ్ళ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.ఆ దూరం కాస్త అయిష్టంగా మారింది.
రీసెంట్ గా కూడా బాలయ్య నాగేశ్వర రావు అంటే నాకు ఎంతో ఇష్టం అని, తన సొంత కొడుకు లాగ చూసుకునేవాడని, నా దగ్గర అంత ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయని, కానీ ఆయన కొడుకు దగ్గర నుండి అలాంటివి దక్కలేదు అంటూ పబ్లిక్ గానే మొన్న మీడియా ముందు మాట్లాడాడు.దీనిని బట్టీ చూస్తుంటే నాగార్జున అంటే బాలయ్య బాబు కి ఎంత ద్వేషం అనేది అర్థం అవుతుంది.ఆయనకీ అంత ద్వేషం ఉండడానికి కారణం, నాగార్జున తన కంటే కూడా ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి కి విలువ ఇస్తాడనే.తన సొంత అన్నయ్య ని భావించినట్టు భావించి, ఎప్పుడు చిరంజీవి భజన చేస్తుంటాడని, అందుకే బాలయ్య బాబు కి నాగార్జున అంటే ఇష్టం ఉండదు అని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ ఎప్పటి నుండి ఉంది.జరిగిన సంఘటనలు మొత్తం చూస్తే అది నిజమే అని అర్థం అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి