మెగా డాటర్ నిహారిక తన మాజీ భర్త చైతన్య జొన్నల గడ్డ తో ఇటీవల విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిహారిక విడాకుల విషయం కాస్త ఇప్పుడు హోల్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈమె విడాకుల వార్త విన్న తర్వాత మెగా అభిమానులు షాక్ అయ్యారు. కానీ ఆమె మాత్రం తన ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుంటూ ఫుల్ జోష్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేసింది నిహారిక. అయితే విడాకుల తర్వాత నిహారిక షేర్ చేసిన మొట్టమొదటి పోస్ట్ కూడా అదే. అయితే ఆ వీడియోలో 

నిహారిక చాలా హ్యాపీగా ఉన్నట్లు తన ఫ్రెండ్స్ తో చిల్లతో కనిపించింది. ముఖ్యంగా ప్రతి గర్ల్స్ గ్యాంగ్ లో అమ్మాయిలు ఎలా ఉంటారంటూ ఒక వీడియోని షేర్ చేసింది ఆమె. అంతే కాదు ప్రతి అమ్మాయిల గ్యాంగ్ లో నాలుగు రకాల అమ్మాయిలు ఉంటారని.. ఎప్పుడు మంచిగా డ్రెస్ వేసుకోవడానికి మక్కువ చెప్తారు అంటూ చెప్పింది నిహారిక. మరొకరు ఏది వేసుకున్న కాన్ఫిడెంట్ గా ఉంటారు. మరొకరు కనీసం రెడీ అయ్యేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపరు. చివరిగా ఒక మహాతల్లి ఉంటుంది తను ఇప్పుడు అసలు కనబడదు అంటూ ఆ పోస్టులో భాగంగా పేర్కొంది నిహారిక.

అయితే నాగబాబు కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె అనంతరం మెల్లగా సినిమాల్లో రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. నటిగా నిర్మాతగా ప్రస్తుతం కెరియర్ లో బిజీగా ఉంది నిహారిక. అయితే తాజాగా తన భర్త నుండి విడాకులు తీసుకున్న ఈమె ఎంజాయ్ చేస్తూ కనిపిస్తూ ఉండడంతో చాలామంది ఆ వీడియో చూసినవారు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి పనులు చేసేందుకు చైతన్య అడ్డుగా ఉన్నాడని అతనికి విడాకులు ఇచ్చి ఎంజాయ్ చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ నిహారిక మాత్రం తామిద్దరం  అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాను అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: