శుక్రవారం వస్తోందంటే చాలు సినీ ప్రియులకు పండుగే అని చెప్పవచ్చు. ప్రతి శుక్రవారం లాగే ఈసారి కూడా ప్రేక్షకులను అల్లరించడానికి చిన్న , పెద్ద సినిమాలు రాబోతున్నాయి అయితే ఒక స్ట్రైట్ తెలుగు సినిమా కాక మరొక రెండు డబ్బింగ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి వీటితోపాటు మరో సినిమా కూడా రంగంలోకి దిగబోతోంది అదే ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ లీడ్ రోజున నటించిన చిత్రం బేబీ. ఈ సినిమా ఈ రోజున విడుదల కాబోతోంది సాయి రాజేష్ డైరెక్టర్ చేసిన ఈ సినిమా పైన మంచి బజ్ అయితే ఏర్పడింది.


బేబీ సినిమాతో పాటు శివ కార్తికేయ నటించిన మహావీరుడు సినిమా కూడా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకి తెలుగులో పెద్దగా ప్రమోట్ చేయలేదు. ఇక మరొక తమిళ్ సినిమా మామన్నన్ తెలుగులో నాయకుడిగా రిలీజ్ చేయబోతున్నారు. మహావీరుడైన సినిమా శివ కార్తికేయన్ వచ్చి ఈవెంట్ చేయడం జరిగింది. వీటితోపాటు భారతీయనుస్ అంటూ ఒక మూవీ ని కూడా తీసుకురావడం జరుగుతొంది. డినా రాజు డైరెక్టర్ గా చేసిన శంకర్ నాయుడు ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయక ఈ సినిమా పైన మంచి బస్ క్రియేట్ అవుతోంది.


ఇలా ప్రతి వీకెండ్ కూడా ఏదో ఒక సినిమా విడుదలవుతూ వస్తోంది. అయితే ఈ సినిమా రెగ్యులర్ సినిమా మాదిరిగానే వచ్చి వెళ్తుందా లేదంటే ప్రేక్షకులను అలరిస్తాయి అన్న విషయం తెలియాల్సి ఉంది. సినిమా ప్రతిభను బట్టి ఈ సినిమా పైన ఆధారపడి ఉంటుంది. నిర్మాతలు పెట్టుబడి , నటీనటుల కష్టం సంగీత దర్శకుడు ప్రతిభ ఇలా అందరూ కూడా డైరెక్టర్ మీదే పని చేయవలసి ఉంటుంది. ఒకవేళ సినిమా సక్సెస్ అయితే అందరూ హ్యాపీగా ఉంటారు. లేకపోతే ఇక ఆ సినిమా నష్టాల బాట పడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: