
ఇటీవలే విడుదలైన టీజర్,పోస్టర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.. పాటలు మాత్రం పెద్దగా ఇన్ఫాక్ట్ చూపించలేదు దీంతో ట్రైలర్ ని సైతం తొందరగా విడుదల చేసి సినిమాకి బజ్ ఏర్పడేలా చేయాలని చిత్ర బృందం భావించింది.ఈ రోజున సాయంత్రం 6:3 నిమిషాలకు ఈ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. వాస్తవానికి ఈ సినిమా రీమిక్స్ సినిమా ఆయన స్టోరీ లైన్ మాత్రమే తీసుకొని తెలుగు ప్రేక్షకుల నెగిటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్రబృందం తెలియజేస్తోంది.
ఇందులో సాయి ధరంతేజ్ సరసన కేతిక శర్మ నటిస్తూ ఉండగా కీలకమైన పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ కూడా నటిస్తున్నది. ఈ సినిమా ట్రైలర్ ని రెండు చోట్ల ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు సమాచారం.. విశాఖపట్నం అలాగే హైదరాబాదులో కూడా ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలు జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. విశాఖపట్నం జగదాంబ థియేటర్లో సాయి ధరంతేజ్ టీజీ విశ్వప్రసాద్ అతిధులుగా వెళ్లగా.. హైదరాబాదులో దేవి 70mm థియేటర్ లో కేతిక శర్మ సముద్రఖని అతిధులుగా ఈ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇలా ట్రైలర్ ని ఒకేసారి రెండు చోట్ల విడుదల చేయడం అనేది ఇదే తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదటిసారి అని చెప్పవచ్చు. మరి ట్రైలర్ తో మరింతా బజ్ ఏర్పరుస్తుందేమో చూడాలి.