ప్రభాస్ తన కెరియర్ లో ఆఖరుగా నటించిన 5 మూవీ లకు నైజాం ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాలను తెలుసుకుందాం.

ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా ... ఓం రౌత్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నైజాం ఏరియాలో 38.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ప్రభాస్ కొంత కాలం క్రితం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన రాధే శ్యామ్ అనే ప్రేమ కథ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. అయినప్పటికీ ఈ సినిమాకు నైజాం ఏరియాలో 24.80 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ప్రభాస్ కొంత కాలం క్రితం సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సహో అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసింది. శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు నైజాం ఏరియాలో 29.58 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 మూవీ కి నైజాం ఏరియాలో 68 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాలో అనుష్క ... తమన్నా హీరోయిన్ లుగా నటించారు.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క ... తమన్నా హీరోయిన్ లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమాకు నైజాం ఏరియాలో 43 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: