ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొన్ని క్రేజీ మూవీ లకు సంబంధించిన షూటింగ్ వివరాలను తెలుసుకుందాం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం ఎన్టీఆర్ తో పాటు మరి కొంత మందితో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న భగవంతు కేసరి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మారేడు పల్లి అడవి ప్రాంతంలో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం బాలకృష్ణ ... శరత్ కుమార్ మరియు కొంత మంది ఇతరులపై ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
 
రవితేజ హీరో గా రూపొందుతున్న ఈగల్ సినిమా లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం ఈ సినిమాలో కీలక పాత్ర లో నటిస్తున్న వారిపై ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఈ మూవీ నుంచి సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

విజయ్ దేవరకొండ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమాకు టైటిల్ ను ఈ మూవీ మేకర్స్ ఫిక్స్ చేయలేదు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదు లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం విజయ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

శ్రీ విష్ణు హీరో గా రూపొందుతున్న స్వగ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ శ్రీ విష్ణు మరియు ఇతరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: