సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్' మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల అయ్యింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే..ముత్తు(రజినీకాంత్) అలియాస్ టైగర్ ముత్తువేల్ పాండియన్ ఒక రిటైర్డ్ జైలర్. కుటుంబంతో కలిసి ఆయన ఓ ఇంట్లో నివసిస్తుంటాడు. అందరూ ఈయన్ని టీజ్ చేస్తుంటారు. ఇక ముత్తు కొడుకు అర్జున్(వసంత్ రవి) అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ).అతను చాలా నిజాయతీగా పనిచేస్తుంటాడు. ఎవరెన్ని చెప్పినా కూడా విగ్రహాలు చోరీ చేసే ముఠాతో తలపడతాడు. అందువల్ల కొన్నాళ్లకు అతడు కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలోనే కొడుకు ఆచూకీ కోసం ముత్తు అన్నిచోట్లకు కూడా వెళ్తాడు. ఇక అలాంటి ముత్తు.. కనిపించకుండా పోయిన కొడుకుని కనిపెట్టాడా లేదా? చివరకు అతను ఏం నిజం తెలుసుకున్నాడు? ఈ స్టోరీలో వర్మ(వినాయగన్), బ్లాస్ట్ మోహన్(సునీల్) ఇంకా కామ్నా(తమన్నా) ఎవరు? అనేది తెలియాలంటే 'జైలర్' సినిమా చూడాల్సిందే.


ఇక సినిమా ఎలా ఉందంటే..స్క్రీన్‌పై రజినీకాంత్ సీన్స్ చూస్తున్నప్పుడు మీరు పూర్తిగా రజినీకాంత్ మేనియాలోకి వెళ్లిపోతారు.గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ సినిమాలో బాగానే ఉన్నాయి.ఇక ఫస్టాప్ విషయానికొస్తే.. అరక్కోణం అనే ఊరిలోని ఓ గుడిలో పూజారిని మర్డర్ చేసి, విగ్రహాం దొంగతనం చేసిన సీన్‌తో సినిమా స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే ముత్తు(రజినీకాంత్), ఆయన ఫ్యామిలీ గురించి చూపిస్తారు. పాపం.. రిటైర్ అయి ఇంట్లో ఉండేసరికి మనవడితో సహా అందరూ ముత్తుని సరదాగా ఆడేసుకుంటూ ఉంటారు. చివరకు అదే వీధిలో ఉండే క్యాబ్ డ్రైవర్(యోగిబాబు) కూడా ఆయన్ని ఏడిపిస్తుంటాడు.కొన్నాళ్లకు తన కొడుకు కనిపించకుండా పోవడం తరువాత పోలీసుల దగ్గరకెళ్లి ముత్తు ప్రాధేయపడటం.. ఇలా సీన్ బై సీన్ చాలా మంచి ఫ్లోలో వెళ్తుంది. ఇక ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ అయితే చాలా మంచి హై ఇస్తుంది.


ఇంటర్వెల్ దాకా రజినీకాంత్ ఇమేజ్, స్టోరీని బాగా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ నెల్సన్.. సెకండాఫ్‌లో మాత్రం జనాల్ని గందరగోళానికి గురిచేశాడు. అప్పటి దాకా ఓ టెంపోలో వెళ్లిన కథ.. సెకండాఫ్‌లో మాత్రం ఎటెటో పోతుంది. ఇక అసలేం జరుగుతుందని ప్రేక్షకుడు అనుకుంటాడు. క్లైమాక్స్ వచ్చేసరికి మళ్లీ స్టోరీ గాడిన పడుతుంది. ఓ మంచి హై ఇచ్చే యాక్షన్ సీన్ ఇంకా ఊహించని సీన్‌తో ఎండ్ కార్డ్ పడుతుంది. ఈ 'జైలర్' కథ కొత్తదేం కాదు. ట్విస్టులు కూడా ఈజీగా ఊహించేయొచ్చు. కరెక్ట్‌గా చెప్పాలంటే స్టోరీలో రజినీకాంత్ హీరోయిజం తప్ప మరేమి లేదు. సో ఫస్ట్ హాఫ్, సాంగ్స్, BGM, రజినీకాంత్ ప్లస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ మైనస్ పాయింట్.

మరింత సమాచారం తెలుసుకోండి: