గుంటూర్ టాకీస్’ మూవీలో నటించిన సిద్ధూ జొన్నలగడ్డ ను ఎవరు పట్టించుకోలేదు. ఆతరువాత అతడు నటించిన ‘కృష్ణ విత్ హిస్ లీల’ మూవీ యూత్ కు బాగా నచ్చడంతో సిద్దూ పేరు చాలామందికి తెలిసింది. అయితే క్రితం సంవత్సరం విడుదలైన ‘డిజే టిల్లు’ తరువాత ఈ యంగ్ హీరో యూత్ కు క్రేజీ హీరోగా మారిపోయాడు.



త్వరలో విడుదల కాబోతున్న ‘టిల్లు స్క్వేర్’ అంచనాలకు అనుగుణంగా బ్లాక్ బష్టర్ హిట్ అయితే ఈ యంగ్ హీరో కెరియర్ కు ఇక ఎదురు ఉండదు. ప్రస్థుతం ఇతడికి ఉన్న క్రేజ్ రీత్యా అనేకమంది దర్శక నిర్మాతలు ఇతడితో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నప్పటికీ వారందరీనీ పక్కకు పెట్టి ఈ యంగ్ హీరో ఒక ఫెయిల్యూర్ దర్శకుడు చెప్పిన కథకు ఓకె చెప్పినట్లుగా వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీలో చాల మంది షాక్ అవుతున్నట్లు తెలుస్తోంది.

అతడు మరెవ్వరో కాదు ‘బొమ్మరిల్లు’ భాస్కర్.



‘బొమ్మరిల్లు’ సినిమా ఘన విజయం తరువాత ఈ దర్శకుడు టాప్ దర్శకుల లిస్టులో చెరిపోతాడు అని అందరు ఊహించారు. అయితే రామ్ చరణ్ తో తీసిన ‘ఆరేంజ్’ ఘోర పరాజయం చెందడంతో ఈ దర్శకుడి క్రేజ్ పూర్తిగా తగ్గిపోయింది. ఆతరువాత లేటెస్ట్ గా అతడు అఖిల్ తో తీసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ హిట్ అయినప్పటికీ ఆ దర్శకుడి వైపు ఎవరు ఆశక్తి కనపరచలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య భాస్కర్ సిద్దూ ని కలవడంతో పాటు అతడికి ఒక క్యూట్ లవ్ స్టోరీని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ స్టోరీ సిద్దూ జొన్నల గడ్డ కు బాగా నచ్చడంతో ఆకథను స్క్రిప్ట్ గా మార్చమని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.



తెలుస్తున్న సమాచారం మేరకు విశ్వక్ సేన్ తో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాను తీసిన నిర్మాతలు సిద్దూ జొన్నలగడ్డ బొమ్మరిల్లు భాస్కర్ ల కాంబినేషన్ సెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి..  




ReplyForward

మరింత సమాచారం తెలుసుకోండి: