అయితే ఇప్పుడు తాజాగా రిలీజ్ డేట్ ని అనౌన్స్మెంట్ చేస్తూ ఆడియన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప గాడి రూల్ వచ్చే ఏడాది ఆగస్టు 15 నుంచి మొదలు కాబోతోంది అంటూ ఒక పోస్టర్ రూపంలో విడుదల చేయడం జరిగింది. ఆగస్టు 15 నుంచి 19 వరకు ఐదు రోజులు కలిసి వస్తుందని ఇక రిలీజ్ డేట్ తో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి మొదటి భాగాన్ని ఓ రేంజ్ తో సెన్సేషనల్ క్రియేట్ చేసిన పుష్ప ఇప్పుడు భారీ అంచనాలతో వస్తున్న సెకండ్ పార్ట్ ఏవిధంగా అభిమానులను ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇందులో అనసూయ, సునీల్ ,ఫహద్ ఫాజిల్, రావు రమేష్ తదితరులు సైతం నటిస్తూ ఉన్నారు. ఇంకా మొదలైన నటీనటులు కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అద్భుతంగా అందించారు. ఇప్పుడు సెకండ్ భాగానికి కూడా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప మొదటి భాగంలో సమంత స్పెషల్ సాంగ్లో నటించక సీక్వెల్ లో మరి ఎవరు నటిస్తారని విషయం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. పుష్ప-2 కి సంబంధించి ప్రస్తుతం ఒక్క పోస్టర్ వైరల్ గా మారుతుంది ఈ పోస్టర్లు అల్లు అర్జున్ చేయిని చూపిస్తూ తన చేతికి ఉన్న ఉంగరాలను హైలైట్ చేస్తూ ఒక పోస్టర్ని విడుదల చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి