ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో వచ్చిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ బేబీ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. కేవలం ఐదారు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 80 కోట్లకు పైగానే గ్రోస్ వసూళ్లను రాబట్టి భారీ షాక్ ఇచ్చింది. దర్శకుడు సాయి రాజేషు బోల్డ్ కంటెంట్తో తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన వైష్ణవి చైతన్య ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే బేబీ సినిమా కంటెంట్ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఫైర్ అయ్యారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు డ్రాగ్ కల్చర్ ని ప్రోత్సహించేలా ఉన్నాయి అని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు బేబీ సినిమాలో ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రైడ్ జరిగిన సన్నివేశాలు కూడా ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు. బేబీ చిత్ర బృందానికి నోటీసులో జారీ చేస్తామని ఆయన చెప్పడంతో ఒక్కసారిగా ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇలా బేబీ సినిమాకి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు ఆయన. ఇక ఎస్ కే ఎన్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. అయితే బేబీ సినిమాపై కమిషనర్ సివి ఆనంద్ చేసిన కామెంట్లకి బేబీ చిత్ర బృందం ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ల విషయానికి వస్తే ఈ సినిమాతో హీరో హీరోయిన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మొదట షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తన కెరియర్ని ప్రారంభించిన వైష్ణవి చైతన్య ఈ సినిమా విజయంతో ప్రస్తుతం వరుస స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఈమె చేతిలో బడా హీరోల సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. హీరో ఆనంద్ దేవరకొండ విషయానికి వస్తే ఆయన కూడా ప్రస్తుతం వయసు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: