షారుఖ్ - అట్లీ కాంబినేషన్లో తెరకెక్కిన 'జవాన్' సెప్టెంబర్ 7న  విడుదలై సెన్సేషనల్ హిట్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో షారుక్ తో పాటు ప్రధాన పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్రలో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా నయనతార కూతురి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సీజ సరోజ్ మెహతా కూడా తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే 'జవాన్' మూవీ ఎక్స్పీరియన్స్ గురించి ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో సీజా సరోజ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'షూటింగ్ టైంలో అట్లీ అంకుల్, షారుక్ అంకుల్ తనను ఎలా ఎంటర్టైన్ చేశారో' ఈ సందర్భంగా తెలిపింది.

 'జవాన్' లో సీజ పాత్రకు స్క్రీన్ టైం తక్కువ ఉన్నప్పటికీ ఉన్నంతలో తన యాక్టింగ్ తో అదరగొట్టింది. ముఖ్యంగా షారుక్, సీజా ల మధ్య వచ్చే సన్నివేశాలు సరదాగా ఉంటూనే ఎమోషనల్ గానూ కనెక్ట్ చేస్తాయి. అంతలా సినిమాలో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకున్న సీజా సరోజ్ తాజా ఇంటర్వ్యూలో 'ఫ్యూచర్లో హీరోయిన్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది'. ఇక జవాన్ మూవీ ఎక్స్పీరియన్స్ ను పంచుకుంటూ 'ఓవైపు స్కూల్, మరోవైపు షూటింగ్.. ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేసేదో' చెప్పింది." నేను నా స్కూల్ బుక్స్ ను 'జవాన్' సెట్ కి తీసుకెళ్లి అక్కడ చదువుకుంటాను. సెట్లో అందరూ నాతో చాలా మంచిగా ఉన్నారు.

నేను సీన్ లో బాగా యాక్ట్ చేసిన ప్రతీసారి అట్లీ అంకుల్ నాకు చాక్లెట్స్ ఇచ్చేవారు. అతను చాలా మంచివాడు" అని చెప్పింది. ఇక షూటింగ్ విరామ సమయంలో తనను బాగా ఎంటర్టైన్ చేసిన షారుక్ ఖాన్ పై సీజా ప్రశంసలు కురిపించింది." షూటింగ్లో షారుక్ అంకుల్ నాతో చాలా సరదాగా ఉండేవారు. నన్ను చాలా ఎంటర్టైన్ చేశారు. సెట్ లో నాతో క్యాచ్ కూడా ఆడతారు" అని తెలిపింది. 'జవాన్' మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదటిసారి కెమెరా ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సీజా ఇప్పుడు మరిన్ని సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది. దీంతో సీజ సరోజ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: