కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం జవాన్ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తోంది. అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో బాలీవుడ్కు పరిచయమైంది నయనతార. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్గా నటించి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా సినీ లవర్స్ ఈ సినిమా కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.700 కోట్లకు పైగా కలెక్షన్ ని అందుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 

ఇదిలా ఉంటే 'జవాన్' వంటి భారీ సక్సెస్ తరువాత నయన్ ఓ తమిళ మూవీకి సైన్ చేసింది. తాజాగా ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. పురాతన నాణాలతోపాటు కొత్త కరెన్సీ నోట్లు మట్టితో కప్పి ఉంచినట్లుగా డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. ఇక మోషన్ పోస్టర్ వీడియోలో అడవి గుడి తో పాటు కళ్ళకు గంతలు కట్టి ఉన్న న్యాయ దేవతను చూపించారు. ఆ తర్వాత 'మన్నన్ గట్టి' అనే టైటిల్ రివిల్ చేస్తూ ఆ టైటిల్ కింద 'Since 1960' అనే క్యాప్షన్ జోడిస్తూ త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. 

దీన్ని బట్టి 1960 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టుతో వస్తున్న ఈ మూవీని పాపులర్ యూట్యూబర్ డ్యూడ్ విక్కీ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ యూట్యూబర్ దర్శకత్వంలో నయనతార ఫిమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్ చేస్తుండడం ఇదే మొదటిసారి. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ. వెంకటేష్ సహనిర్మాత. R.Dరాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా, సీన్ రోల్డెన్ సంగీతం అందిస్తున్నారు. జి.మదన్ ఎడిటింగ్ బాధ్యతలు చేపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: