టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం పుష్పా సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతోంది ఈ నటి. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లో సైతం అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ బిజీగా మారింది. స్టార్ హీరో అమితాబ్ సినిమాలో సైతం నటించి మెప్పించింది ఈ చిన్నది. అయితే తాజాగా ఈమెకి సంబంధించిన ఒక వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ అమ్మడు బాలీవుడ్లో మరొక క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా ఒక సినిమా రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందనను మేకర్స్ ఫిక్స్ చేశారు అన్న వార్తలు వినబడుతున్నాయి. మొదట ఈ సినిమాలో శ్రీ లీలని హీరోయిన్గా ఫిక్స్ చేశారు అన్న వార్తలు వినిపించాయి. కానీ శ్రీ లీలకి డేట్స్ కుదరకపోవడంతో ఆ స్థానంలోకి ఇప్పుడు రష్మిక మందనని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు రష్మిక మదన మరియు రవితేజ కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా వచ్చింది లేదు. అందుకే వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో దర్శకులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

 కాగా ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇక గోపీచంద్ మలినేని రవితేజ కాంబినేషన్లో రానున్న నాలుగవ సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో నుపూర్ సనన్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ సినిమా అక్టోబర్ 20 నా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్టువర్టుపురం గజదొంగ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు మాస్ రాజా అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: