
కామ్ గా ఉండండి యుద్ధానికి సిద్ధం కండి అనే క్యాప్షన్ తో ఉన్న ఒక పోస్టర్ని లియో సినిమా అని హైప్ చేసేలా కనిపిస్తున్నది. ఇందులో విజయ్ తన ఆయుధాన్ని సాన పెడుతున్నట్లుగా నిప్పు రవ్వలు ఎగసిపడుతున్నట్లుగా కనిపిస్తోంది. విజయ దళపతి కొత్త అవతార్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోబోతోంది. ఈ సినిమా ఆడియో లాంచ్ త్వరలోనే చెన్నైలో జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చిత్ర బృందం మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ చాలా గ్రాండ్గా విడుదల చేస్తోంది. లియోను సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లో ఎస్ఎస్ లలిత్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ పోస్టర్ను విజయ్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయక 32 నిమిషాలలోనే మిలియన్ లైక్స్ రాబట్టడం జరిగింది. జియో సినిమా ఇండియాలోనే మొత్తం 26 ఐమాక్స్ స్క్రీన్ లలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. 30వ తేదీన చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆడియో ఫంక్షన్ని ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్ త్వరలోనే విడుదల చేయబోతున్నారు. మరి భారీ అంచనాల మధ్య దసరా కానుకగా విడుదల కాబోతున్న సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.