తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి వరకు టాలీవుడ్ లో మాత్రమే స్టార్ హీరోగా కొనసాగిన రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్ ని సంపాదించాడు అని చెప్పాలి. దీంతో ఇక రామ్ చరణ్ నుంచి ఏదైనా సినిమా వస్తుంది అంటే చాలు ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.


 ఇక డాన్సుల్లో యాక్టింగ్ లో తండ్రికి ఎక్కడ తక్కువ కాదు అని తాను చెప్పడం కాదు.. ఏకంగా ప్రేక్షకుల చేత అనిపించుకున్నాడు ఈ మెగా వారసుడు. ఇక సినిమాల కోసం ఎంతో కష్టపడుతూ ప్రస్తుతం టాప్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారిందట. ఒకానొక సమయంలో తండ్రి మెగాస్టార్ ను ఒక విషయంలో రామ్ చరణ్ బ్లాక్ మెయిల్ చేశాడట. చరణ్ సినిమాల్లోకి రాకముందు నుంచే చిరంజీవి చరణ్ ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాడట. ఈ క్రమంలోనే శ్రీహరి వద్దకు ఫిట్నెస్ కోసం చరణ్ పంపించాడట చిరంజీవి.



 కానీ రెండు రోజులు కూడా శ్రీహరి దగ్గర ఉండలేక.. రామ్ చరణ్ చేతులెత్తేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాడట. శ్రీహరి దగ్గరికి వెళ్తే నేను చచ్చిపోతాను.. ఆయన అంత కఠినంగా వర్కౌట్స్ చేపిస్తున్నాడు అని తండ్రి వద్ద ఏడ్చేసాడట. నేను మళ్ళీ శ్రీహరి దగ్గరికి వెళ్ళను అని మొండి చేశాడట చరణ్. అయితే దివంగత నటుడు శ్రీహరి ఫిట్నెస్ విషయంలో ఎంత కఠినమైన రూల్స్ ఫాలో అవుతాడో ప్రేక్షకులకు కూడా తెలుసు. అందుకే ఇండస్ట్రీలో అందరూ శ్రీహరిని ఫిట్నెస్ రాక్షసుడు అని పిలుస్తూ ఉంటారు. అయితే రామ్ చరణ్ - శ్రీహరి ఇద్దరు కూడా మగధీర సినిమాలో కలిసిన నటించారు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఫిట్నెస్ విషయంలో ప్రస్తుతం చరణ్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: