కోలీవుడ్ స్టార్
హీరో దళపతి విజయ్ విజయ్ కి సౌత్
ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ ఉంది. తన సినిమాలని తెలుగులో సైతం డబ్ చేసి ఇక్కడ కూడ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.తాజాగా
విజయ్ ఇప్పుడు నటిస్తున్న
సినిమా లియో.
'లియో'(Leo) మూవీని ఇప్పుడు కేరళ ఆడియన్స్ బాయికాట్ చేసేందుకు సిద్ధమైనట్లు ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా లో మీడియాలో #Kerala Boycott Leo అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సౌత్ లో భారీ క్రేజ్ తో మోస్ట్ అవైటెడ్ మూవీ గా రాబోతున్న 'లియో' ని ఉన్నట్టుండి కేరళలో బ్యాంక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటూ పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇందుకు అసలు కారణమేంటనేది చాలామందికి తెలియడం లేదు. అయితే తాజాగా అందుకు ఓ కారణం ఉందనే విషయం బయటకు వచ్చింది. సోషల్ మీడియా డిస్కషన్స్ లో భాగంగా కేరళలోని కొందరు మోహన్ లాల్ అభిమానులు, విజయ్ అభిమానుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ స్టార్స్ ఇద్దరు కలిసి నటించిన 'జిల్లా' చిత్రంలో విజయ్ నటన మోహన్ లాల్ ముందు తేలిపోయిందని మోహన్ లాల్ ఫ్యాన్స్ అన్నారు. అది కాస్త తమిళ విజయ్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. దీంతో వాళ్లు ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు. మోహన్ లాల్ నటన చాలా చిత్రాల్లో చెత్తగా ఉందంటూ క్లిప్స్, ఫోటోలు షేర్ చేయడం మొదలెట్టారు. దీన్ని విజయ్ ఫ్యాన్స్ కొందరు ఓ ఉద్యమంగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో మోహన్ లాల్ ఫ్యాన్స్ 'మా మోహన్ లాల్ నే అంటారా? మా కేరళలో మీ హీరో సినిమా ఆడనివ్వమంటూ' #Kerala Boycott Leo అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఇక దాన్ని విజయ్ యాంటీ ఫ్యాన్స్ షేర్ చేయడం, మొదలెట్టారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో #Kerala Boycott Leo అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఇక 'లియో' విషయానికి వస్తే.. 'విక్రమ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది.