'జయం` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ దగ్గరైంది సదా. ఇందులో పల్లెటూరి అమ్మాయిలా, ప్రేమికురాలిగా ఆకట్టుకుంది. పక్కింటి అమ్మాయిలా కనిపించి వెండితెరపై మ్యాజిక్‌ చేసింది. ఏ క్లాస్‌ ఆడియెన్స్ నుంచి సీ క్లాస్‌ ప్రేక్షకులను సైతం మెప్పించింది. మన అమ్మాయిలా దగ్గరైంది.ఆ టైమ్‌లో వరుసగా విలేజ్‌ డ్రామా నేపథ్యంతో కూడిన సినిమాలు చేసింది సదా. అలా పల్లెటూరి పిల్లలా మారిపోయింది. హోమ్లీ బ్యూటీగా మెప్పించింది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ప్రారంభంలో ఎంత హోమ్లీ బ్యూటీగా మెప్పించిందో ఆ తర్వాత గ్లామర్‌ షో చేసి షాకిచ్చింది.`అపరిచితుడు` వంటి చిత్రాల్లో డబుల్‌ డోస్‌ చూపించింది. ట్రెడిషనల్ అమ్మాయిగా కనిపిస్తూనే రెమో పాత్ర కోసం గ్లామర్‌ బ్యూటీగా మెరిసింది. పొట్టి దుస్తుల్లో రొమాంటిక్‌ సాంగ్‌లో రెచ్చిపోయి హాట్‌ షో చేసింది. ఇదంతా చేసింది సదానేనా అనే ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదైనా సినిమా కోసమే అనేది సదా కాన్సెప్ట్.ఏం చేసినా తెలుగు ఆడియెన్స్ కి మాత్రం `జయం` బ్యూటీగానే ముద్ర వేసుకుంది. ఇప్పటికీ అలానే కనిపిస్తుంది. హీరోయిన్‌గా అనేక విజయాలు అందుకుంది.స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. కానీ కెరీర్‌ డౌన్‌ అవుతున్న సమయంలోనే సినిమాలకు గుడ్‌ బై చెప్పింది. సినిమాల నుంచి తప్పించుకుంది.

కొంత కాలం ఎవరికీ కనిపించలేదు. అలాగని పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ కాలేదు. ఆ టైమ్‌లో ఏం చేసిందో ఏమో.. మళ్లీ గత రెండేళ్లుగా మెరుస్తుంది. ఇప్పుడు తెలుగు బుల్లితెరపై సందడి చేస్తుంది. ప్రస్తుతం `నీతోనే డాన్సు` అనే షోకి జడ్జ్ గా చేస్తుంది.అంతకు ముందు బీబీ జోడీకి జడ్జ్ గా చేసింది. కొన్నాళ్లపాటు జబర్దస్త్ షోకి జడ్జ్ గా చేసింది. శ్రీదేవీ డ్రామా కంపెనీలోనూ మెరిసింది. కామెడీ స్టార్స్ లోనూ మెరిసింది. ఇప్పుడు డాన్సు షోలకు జడ్జ్ గా చేస్తూ అలరిస్తుంది. అయితే ఈ షో కోసం ఆమె ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది. అందాల విందుతో అదరగొడుతుంది.అందులో భాగంగా జిగేల్‌ రాణిలా మెరుస్తుంది. కారవాన్‌లో కూర్చొని ఫోటోలకు పోజులిచ్చింది. ఇందులో ఆమె జిగేల్‌ రాణిలా మెరిసిపోతుంది. కిల్లర్‌ పోజులతో కవ్విస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఆకట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: