
తెలుగులో మహేష్ బాబు తో కలిసి గుంటూరు కారం సినిమాలో నటించే అవకాశం వచ్చిన ఈ సినిమాని వదులుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రవితేజ, నాని సినిమాలలో కూడా త్వరలో నటించబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సడన్గా పూజ హెగ్డే ప్రేమలో ఉందని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. సినిమాల్లో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇలా ప్రేమ వ్యవహారం తెలియగానే అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.
ప్రముఖ క్రికెటర్ తో పూజా హెగ్డే ప్రేమాయణం నడుపుతోందని అతని పేరు మాత్రం బయటికి చెప్పట్లేదని వీరిద్దరూ క్లోజ్ గా ఉంటున్నట్లు సమాచారం. త్వరలోనే ఆ క్రికెటర్ తో ఈమె వివాహం అనౌన్స్మెంట్ చేయబోతుందని వార్తలు వినిపిస్తూన్నాయి. అంతేకాకుండా పెళ్లి కోసమే పూజా హెగ్డే సినిమాలకు కాస్త విరామం ఇస్తోంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసి అభిమానుల సైతం ఒక్కసారిగా షాక్ అయ్యేలా పూజ హెగ్డే ఇలా ఇచ్చిందే అంటూ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి పూజ హెగ్డే నిజంగానే ప్రేమలో ఉందో లేదో అనే విషయం తెలియాలి అంటే ఆమె కచ్చితంగా ఈ విషయం పైన స్పందించాల్సి ఉంటుంది.