ప్రతి ఏడాది సంక్రాంతి వార్ స్టార్ హీరోల మధ్య జరుగుతూనే ఉంటుంది.. స్టార్ హీరోల చిత్రాలు ఈ ఏడాది కూడా బిగ్ వార్ జరిగిందని చెప్పవచ్చు. కానీ స్టార్ హీరోలు కాకుండా సీనియర్ స్టార్ హీరోల మధ్య ఈసారి సంక్రాంతి సినిమాలతో వచ్చి మంచి విజయాలను అందుకున్నారు.2024 సంక్రాంతి ఫైట్ కోసం ఎప్పటినుంచో అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది పండుగకు ఒక బిగ్గెస్ట్ క్లాస్ ఉంటుందని ఈ సినిమాలను బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది.


ముందుగా సంక్రాంతి సీజన్ లో స్లాట్ రిజర్వ్ చేసుకున్న చిత్రం కల్కి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో హీరోగా ప్రభాస్ నటిస్తున్నారు. జనవరి 12న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత రవితేజ నటిస్తున్న ఈగల్ సినిమా కూడా ఈ ఈ చిత్రాలతో పోటీ పడబోతోంది. అలాగే యంగ్ హీరో తేజ సాజన్ నటిస్తున్న హనుమాన్ సినిమా కూడా జనవరి 12న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు.


అలాగే విజయ్ దేవరకొండ పరుశురామ్ కాంబినేషన్లో వస్తున్న ఒక చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. నాగార్జున నటిస్తున్న నా సామిరంగ సినిమా కూడా సంక్రాంతి రేస్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ సినిమాల మధ్య ఇప్పుడు తాజాగా మరొక డబ్బింగ్ సినిమాని విడుదల చేయబోతున్నారు. నటుడు శివ కార్తికేయన్ హీరోగా సైన్స్ ఫిక్షన్ సినిమాగా ఆయాలాన్ కూడా సంక్రాంతి రేసులో ఉండబోతున్నట్లు ప్రకటించారు ఇన్ని సినిమాలు ఒకేసారి థియేటర్లో విడుదల అయితే కలెక్షన్స్ పైన కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది మరి ఇందులో ఏ సినిమాలను రిలీజ్ చేస్తారో ఎప్పుడు వాయిదా వేస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: