దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కొంచెం గ్యాప్ తర్వాత పెద కాపు - 1 అనే ఓ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.సామాన్యుడి సంతకం అనేది ట్యాగ్ లైన్. కొత్త నటీనటులతో అడ్డాల చేస్తున్న ఈ ప్రయోగంపై ఇండస్ట్రీలో గట్టిగానే బజ్ ఉంది. ఇక మూవీ టీమ్ ఓ అడుగు ముందుకేసి కీలక నిర్ణయం కూడా తీసుకుంది. అందుకు పెద్ద ప్లాన్ వేసి ప్రీమియర్స్ వేసేందుకు రెడీ అయింది. విరాట్ కర్ణను హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఇప్పటికే రిలీజైన సినిమా పోస్టర్, టీజర్ ఇంకా ట్రైలర్ బాగా అనిపించాయి. ఇంకా ఈ కథను చాలా సెన్సిటివ్ ఎలిమెంట్స్తో తెరపైకి తీసుకురాబోతున్నారు. ద్వారకా క్రియేషన్స్ పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు.ఈ సినిమాలో ప్రగతి శ్రీ వాస్తవ హీరోయిన్గా నటించింది. రావు రమేశ్‌, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగ, రాజీవ్‌ కనకాల, అనసూయ, ఈశ్వరిరావు ఇంకా నరేన్‌ తదితరులు సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


మిక్కీ జె.మేయర్‌ సంగీతం, ఛోటా కె.నాయుడు ఈ సినిమాకి ఛాయాగ్రహణం అందించారు. ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది.ఇక ఈ సందర్భంగా సెప్టెంబర్ 28న పెయిడ్ ప్రీమియర్స్ వేసేందుకు రెడీ అయింది మూవీటీమ్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య 70ఎంఎం థియేటర్లో రాత్రి 9.30 గంటలకు షోని ప్రదర్శించనున్నారు. ఇక బుక్ మైషో, పేటీఎమ్లో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో హీరో గొడ్డలి పట్టుకుని కొంతమందిపై విరుచుపడుతూ కనిపించారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ని తెచ్చుకుంటుందో..అయితే గత రెండు వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు సరైన సినిమాలు లేవు. జవాన్ సినిమా ఒక్కటే ఆడుతోంది. అయితే ఈ వారం పెద కాపుతో పాటు బోయపాటి రామ్పోతినేని స్కంద ఇంకా చంద్రముఖి 2 వస్తున్నాయి. స్కంద, చంద్రముఖిపై కూడా చాలా  అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: