నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్ లో ఇదే మొట్ట మొదటి సినిమా కావడం విశేషం.

మూవీ లో శ్రీ లీల ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. సైన్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ మూవీ.లో శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా ఈ మూవీ బృందం పూర్తి కాబోతున్నట్లు సమాచారం.

ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో శ్రీకాంత్ జైలర్ పాత్రలో నటిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో శ్రీకాంత్ ది చాలా ముఖ్యమైన పాత్ర అయినప్పటికీ ... అది జైలర్ పాత్ర మాత్రం కాదు అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై బాలకృష్ణ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: