టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఇంకా మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇప్పటిదాకా ఈ సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే..మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 4 రోజుల్లో  బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.ఇంకా అంతకాదు యూఎస్‌లో 1.7 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన మూవీగా నిలిచింది. ఇది ఒక చిన్న హీరోకి సూపర్ రికార్డ్. ఈ సినిమా ఇప్పుడు 2 మిలియన్ డాలర్ల వైపు దూసుకుపోతుంది.మొత్తానికి ఈ సినిమా చిన్న సినిమాగా విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా తాజాగా 50 కోట్ల రూపాయల కలెక్షన్స్ మార్క్ కు చేరుకుని చిన్న సినిమాల్లో  అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేసింది.


'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూడో వారంలో కూడా స్టడీ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది. ఆడియెన్స్ ఆదరణతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు కూడా అందుకుందీ సినిమా. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌ నిర్మాణంలో దర్శకుడు మహేష్ బాబు.పి తెరకెక్కించారు.మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీలో అనుష్క శెట్టి షెఫ్ పాత్రలో బాగా ఆకట్టుకుంది. మరోవైపు నవీన్ పోలిశెట్టి స్టాండప్ కామెడీ చేసే యువకుడి పాత్రలో చక్కగా నటించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత టాలీవుడ్ సినీ ప్రముఖులైన చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, రవితేజ ఇంకా సమంత సహా పలువురు ఈ సినిమాపై ప్రశంసల ఝల్లు కురిపించారు. అది ఇప్పుడు వసూళ్ల రూపంలో కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: